ప్రభాస్, సూర్య కాంబోలో మూవీ.. కానీ ఊహించని ట్విస్ట్..!?

frame ప్రభాస్, సూర్య కాంబోలో మూవీ.. కానీ ఊహించని ట్విస్ట్..!?

Anilkumar
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ హిట్ సాధించింది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఈ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమా అద్భుతంగా ఉందనే పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలోనూ కల్కి 2898 ఏడీ సినిమా దూసుకెళుతోంది. గ్లోబల్ రేంజ్‍లో సత్తాచాటి టాప్ ప్లేస్‍కు చేరింది. కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‍తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణ్ ప్రధాన పాత్రలు పోషించారు. సస్వత ఛటర్జీ, దిశా పటానీ, పశుపతి, శోభన, రాజేంద్ర

 ప్రసాద్, అన్నా బెన్ కీలకపాత్రలు పోషించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, దర్శక ధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్ సహా మరికొందరు క్యామియో రోల్స్‌లో కనిపించారు. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న సినిమాల్లో క్రేజీ సీక్వెల్ ‘సింగం అగైన్’ మోస్ట్ అవైటేడ్ మూవీగా ఉంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే దీపావళికి ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలోనే ప్రభాస్, సూర్య గెస్ట్ రోల్ చేస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా రోహిత్ శెట్టి, కల్కి

 మ్యూజిక్‌ను వాడూతూ ఒక వీడియో రిలీజ్ చేయగా.. ప్రభాస్ ‘సింగం అగైన్‌’లో క్యామియో ఇస్తున్నాడనే టాక్ మొదలైంది. ఇక ఇప్పుడు ఒరిజినల్ సింగం సూర్య కూడా ఈ సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. సూర్య చేసిన సింగం సిరీస్ ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇదే సిరీస్‌ను బాలీవుడ్‌లో చేయగా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో.. ఇప్పుడు సూర్య కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. ప్రభాస్, సూర్య ఒకే సినిమాలో కనిపిస్తే మామూలుగా ఉండదనే చెప్పాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: