రీసెంట్ టైమ్స్ లో సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియా వేదికగా చాలామందికి రెస్పాండ్ అవ్వటం మొదలు పెడుతున్నారు. ఒకప్పుడు సామాన్యులు పెట్టే పోస్ట్ లను పెద్దగా పట్టించుకునే వారు కాదు కొంతమంది సెలబ్రిటీస్. రీసెంట్ టైమ్స్ లో మాత్రం మామూలు నెటిజన్స్ తో కూడా చాలామంది ఇంట్రాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. ఏదైనా ఒక వార్త జరిగిన వెంటనే అది క్షణాల్లో చాలామందికి రీచ్ అవుతుందంటే దానికి కారణం సోషల్ మీడియా. ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా ఒకరినొకరు సోషల్ మీడియాలోని ప్రశ్నించడం కూడా మొదలుపెట్టారు.
ఇక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం వలన పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. చాలా గ్రామాలు ముంపుడుకు గురై చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ తరుణంలో వైసీసీ చీఫ్ జగన్ “రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? అంటూ ప్రశ్నించారు. ఈ పోస్ట్ కి చాలామంది రియాక్ట్ అయ్యారు. నటుడు బ్రహ్మాజీ కూడా స్పందించారు. ఈ ప్రభుత్వం సాయం చేయలేదని, మనమైనా చేద్దామని తనదైన శైలిలో పోస్ట్ చేశారు. ‘ఫస్ట్ రూ. 1000 కోట్లు రిలీజ్ చేద్దాం. వైసీపీ కేడర్ ను రంగంలోకి దింపుదాం. మనకు జనాలు ముఖ్యం. ప్రభుత్వం కాదు. మనం చేసి చూపిద్దాం. జై జగన్ అన్న’ అంటూ రాసుకొచ్చారు.
ఇలా బ్రహ్మజీ రాసిన రిప్లై కి చాలామంది వైసిపి శ్రేణులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది బ్రహ్మజీని ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు. అధికారంలో ఉన్నా, .విపక్షంలో ఉన్నా జగన్నే విమర్శించడం కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని చాలామంది మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మీకెందుకు కోపం వచ్చిందని నిలదీశారు. కోటి రూపాయలు తో పాటు ycp ప్రజాప్రతినిధులు నెల జీతాన్ని కేటాయించడం కనిపించలేదా?అంటూ ప్రశ్నించగానే ఆ పోస్ట్ డిలీట్ అయింది.అయితే దీనిపై స్వయంగా బ్రహ్మాజీ స్పందిస్తూ, నా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. ఆ పోస్ట్ కి నాకు సంబంధం లేదు.ఆల్రెడీ కంప్లైంట్ చేశాను అంటూ బ్రహ్మాజీ అది చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బ్రహ్మాజీ ఈ మాటలను చెప్పిన కూడా ఎవరికి నమ్మశక్యంగా అనిపించట్లేదు. ఎందుకంటే బ్రహ్మాజీ ఎలాంటి సెటైరికల్ వేలో మాట్లాడతారో చాలామందికి తెలుసు. అందుకే ఖచ్చితంగా ఈ పోస్ట్ బ్రహ్మాజీ చేసి తనకు వరుసగా ఫోన్ కాల్స్, వేధింపులు రావడంతో నన్ను వదిలేయండి అనే ఇంటెన్షన్ తో ఇలా పోస్ట్ పెట్టుంటాడు అని చాలామంది అనుకుంటున్నారు.