హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న వారు సినిమాకి కోట్లలో పారితోషకం తీసుకుంటున్నారు. కానీ చాలా తక్కువ సినిమాలు చేస్తున్న కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదిస్తూ భారీ మొత్తంలో టాక్స్ ను ప్రభుత్వానికి చెల్లిస్తున్న నటీమణులు బాలీవుడ్ లో ఉన్నారు. ఇకపోతే ఈ సంవత్సరం అత్యధిక టాక్స్ ను చెల్లించిన ముగ్గురు టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎవరో తెలుసుకుందాం.
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇకపోతే ఈమె ఈ మధ్య కాలంలో మాత్రం భారీ ఎత్తున సినిమాలు చేయడం లేదు. కానీ కొన్ని బ్రాండ్ లకి ప్రమోషన్లను చేస్తుంది అలాగే అడపా దడపా సినిమాల్లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది. ఇక ఈమె ఈ సంవత్సరం దాదాపుగా 20 కోట్ల టాక్స్ ను చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ నటీమని కియార అద్వానీ ఈ సంవత్సరం 12 కోట్ల టాక్స్ ను చెల్లించినట్లు తెలుస్తుంది.
ఈ నటి ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తుంది. అలాగే రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ లో హీరోయిన్గా నటించింది. తర్వాత మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కత్రినా కైఫ్ ఈ సంవత్సరం 11 కోట్ల టాక్స్ ను ప్రభుత్వానికి చెల్లించినట్లు తెలుస్తుంది. కత్రినా కైఫ్ కొంత కాలం క్రితమే సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన టైగర్ 3 సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు బాలీవుడ్ లో అత్యంత ఎక్కువ టాక్స్ ను చెల్లించిన వారిగా సమాచారం.