ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల మధ్య తమిళ హీరో తట్టుకోగలడా..?

frame ఇద్దరు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల మధ్య తమిళ హీరో తట్టుకోగలడా..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ లేని సందడి వాతావరణం కనబడుతూ ఉంటుంది. సంక్రాంతి పండుగకు తెలుగు సినిమాలే భారీ ఎత్తున విడుదల అవుతూ ఉంటే కొన్ని సందర్భాలలో డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతూ ఉంటాయి. ఇకపోతే వచ్చే సంవత్సరం కూడా సంక్రాంతి పండుగకు ఇలాంటి వాతావరణం కనబడే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగకు తెలుగు నుండి రెండు సినిమాలు విడుదలకు ఇప్పటికే రెడీ అయ్యాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

త్రిష ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మల్లాడి వశిష్ట ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటు తమిళ ఓ డబ్బింగ్ సినిమా కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. తమిళ నటుడు అజిత్ ప్రస్తుతం గుడ్ బాడ్ అగ్లీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. మరి మంచి క్రేజ్ కలిగిన చిరు , వెంకటేష్ నటించిన సినిమాలు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానుండగా ఆ ఇద్దరు హీరోలతో పోటీపడి తెలుగు రాష్ట్రాల్లో అజిత్ మూవీ పెద్ద స్థాయిలో కలెక్షన్లను వసూలు చేయడం కష్టమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి వచ్చే సంక్రాంతి కి ఎవరు ఏ స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: