" ఉస్తాద్ భగత్ సింగ్ " కోసం హరీష్ శంకర్ మార్పులు.. ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయి..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాను ఇప్పటికే ప్రారంభించాడు హరీష్ శంకర్. కొంతమేర షూటింగ్ కూడా జరుపుకుంది ఈ సినిమా. అయితే, తాజాగా 'మిస్టర్ బచ్చన్' సినిమా ఫెయిల్యూర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం పక్కా ప్లానింగ్ తో రావాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్. దీంతో ఈ సినిమా స్త్రీప్టులో పలు మార్పులు చేస్తున్నాడని..తన రైటర్స్ టీమ్ తో ఇదే విషయంపై చర్యలు కూడా జరుపుతున్నాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో పవన్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో యంగ్ బ్యూటీ స్త్రీల హీరోయిన్గా నటిస్తుండగా..మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని ప్రోడ్యూస్ చేస్తున్నారు. మరి నిజంగానే ఉస్తాద్ కోసం హరీష్ శంకర్ మార్పులు చేస్తున్నాడా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తారో అంటూ ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.