తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో
అనిల్ రావిపూడి ఒకరు. ఈయన
కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన
పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి
మూవీ తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత ఈ దర్శకుడు అనేక సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో ప్రతి
సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. దానితో ఈయన ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే కొంత కాలం క్రితం
అనిల్ రావిపూడి , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా
రష్మిక మందన హీరోయిన్గా సరిలేరు నీకెవ్వరు అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ ని రూపొందించాడు.
ఇక ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్
సక్సెస్ అయింది.
అనిల్ , సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి పెద్ద స్టార్
హీరో ఉన్నా కూడా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నింటినీ ముందే పూర్తి చేసి
సినిమా షూటింగ్ను మొదలు పెట్టాడు. జెట్ స్పీడ్ లో
మూవీ ని పూర్తి చేసి
సంక్రాంతి పండుగకు విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం
అనిల్ ,
వెంకటేష్ హీరోగా
ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి
చౌదరి హీరోయిన్లుగా ఓ
మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.
ఇక
అనిల్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా చాలా రోజులు చేశాడు. ఇక ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. జెట్ స్పీడ్ లో ఈ
సినిమా షూటింగ్ కూడా పూర్తి అవుతూ వస్తుంది. మరి ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనూ , షూటింగ్ విషయంలోనూ సరిలేరు నీకెవ్వరు సినిమాను ఫాలో అవుతున్న
అనిల్ కి ఆ
సినిమా లాంటి విజయమే అనే
వెంకటేష్ మూవీ తో దక్కుతుందో లేదో చూడాలి.