సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఈ మధ్య కాలంలో దాదాపు సంవత్సరానికి రెండు సినిమాలు , అప్పుడప్పుడు ఒక సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇక కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి చాలా స్పీడ్ గా సినిమాలను పూర్తి చేస్తూ సంవత్సరానికి చాలా ఎక్కువ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉండేవాడు. ఇక చిరంజీవి తన కెరీర్ లో కేవలం 29 రోజుల్లోనే ఓ మూవీ ని పూర్తి చేశాడు. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి సంబంధించిన చిత్రీకరణ కేవలం 29 రోజుల్లోనే పూర్తి అయ్యింది. ఈ మూవీ లో చిరంజీవికి జోడిగా మాధవి నటించగా ... పూర్ణిమ , గొల్లపూడి మారుతీ రావు , సంగీత , పి ఎల్ నారాయణ , అన్నపూర్ణ ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కే రాఘవ ఈ సినిమాను నిర్మించారు.
జే వి రాఘవులు ఈ సినిమాకు సంగీతం అందించారు. 1982వ సంవత్సరంలో విడుదల అయిన ఈ సినిమాకు మొదట యావరేజ్ టాక్ ను తెచ్చుకున్న ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు మెల్లిమెల్లిగా పెరిగి చివరగా సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ 8 కేంద్రాలలో 50 రోజులు , 2 కేంద్రాల్లో 100 రోజుల్లో ఆడింది. ఇలా 29 రోజుల్లోనే పూర్తి అయిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ఆ సమయంలో మంచి కలెక్షన్లను వసూలు చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.