అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోన్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

frame అమెజాన్ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోన్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Anilkumar
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. చైతన్య రావ్ నటిస్తున్న చిత్రాలన్నీ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు మంచి మార్కులే పడ్డాయి.‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి

 మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఈ కాలంలో ప్రేమ - పెళ్లి - విడాకులు ..

చకచకా జరిగిపోతున్నాయి. యువతీ యువకులు ప్రతి విషయంలోనూ ఫాస్టుగా ఉంటున్నారు. అపార్థాలతో విడిపోతున్నారు. అందుకు కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం .. అందుకు తగిన సమయాన్ని ఎంత మాత్రం కేటాయించలేకపోవడం. అలాంటి ఒక జంట కలిసి ఉండటం కోసం చేసిన సూచనగా 'హనీమూన్ ఎక్స్  ప్రెస్' కాన్సెప్ట్ కనిపిస్తుంది.కొత్తగా పెళ్లయిన ఒక జంటకి జీవితం పట్ల ఆవగాహన కలిగించి, వాళ్లను కలిపి ఉంచేలా చేయాలనే ఒక ఆలోచన మంచిదే. అయితే అందుకోసం దర్శకుడు రాసుకున్న కథ .. కథనం .. సన్నివేశాలు .. సంభాషణలు ఆడియన్స్ కి ఎంతమాత్రం కనెక్ట్ అయ్యేలా లేవు. కథలో చాలా భాగాన్ని హీరో హీరోయిన్స్ చుట్టూ తిప్పారు. పైగా నాలుగు గోడల మధ్య నడిచే సన్నివేశాలు ఎక్కువ.  ఎంతమాత్రం పట్టులేని సన్నివేశాలు అవి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: