అఫీషియల్ : ఆ తేదీన రీ రిలీజ్ కానున్న వెంకీ..!

frame అఫీషియల్ : ఆ తేదీన రీ రిలీజ్ కానున్న వెంకీ..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం వెంకి అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని స్నేహ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ 2004 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ మూవీలోని కామెడీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికి కూడా ఈ సినిమాలోని కామెడీ ని అనేక మంది ప్రేక్షకులు ఇష్ట పడుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా రీ రిలీజ్ అవుతున్న సినిమాలలో చాలా సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తున్నాయి. దానితో 2004 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం సాధించిన వెంకీ మూవీ ని కూడా మరికొన్ని రోజుల్లోనే రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

తాజాగా ఈ మూవీ బృందం వారు వెంకీ సినిమాని సెప్టెంబర్ 21 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషలేదియలో ఫుల్ వైరల్ అవుతుంది. మరి 2004 లో విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న వెంకీ సినిమా రీ రిలీస్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్లను వసూలు చేసి ఏ రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: