వారిని స్పెషల్ టార్గెట్ చేసిన చరణ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

frame వారిని స్పెషల్ టార్గెట్ చేసిన చరణ్.. ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకరు. రామ్ చరణ్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్నాడు. తాజాగా చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి సంబంధించిన పనులు ఇప్పటికే తుది దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమాలోని రెండవ సాంగ్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రామ్ చరణ్ తలకి ఒక ఎర్ర కండువాను కట్టుకొని ఉన్నాడు. ఎక్కువ శాతం తలకి ఎర్ర కండువాను పవన్ కళ్యాణ్ సినిమాలలో కట్టుకొని కనిపిస్తూ ఉంటాడు. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ ఎర్ర కండువాను తలకు కట్టుకొని కనిపిస్తాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడానికి రామ్ చరణ్ తలకి కండువాను కట్టుకున్న స్టీల్ ను గేమ్ చేంజర్ మూవీ యూనిట్ విడుదల చేసింది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరి ఈ మూవీ బృందం అదే స్ట్రాటజీ తో రామ్ చరణ్ తలకు ఎర్ర కండువాను కట్టుకున్న పోస్టర్ను విడుదల చేసి ఉంటే వారి ప్లాన్ ఏ స్థాయిలో వర్కౌట్ అవుతుందో చూడాలి. గేమ్ చేంజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కియార అద్వానీ , చరణ్ కి జోడిగా కనిపించబోతోంది. అంజలి , సునీల్ , శ్రీకాంత్ , నవీన్ చంద్ర ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతుండగా ... తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: