చీర కట్టులో నడుమందాలతో రెచ్చిపోయిన త్రిష..!

frame చీర కట్టులో నడుమందాలతో రెచ్చిపోయిన త్రిష..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు , తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన ముద్దుగుమ్మలలో త్రిష ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన ఆడి పడి ఎన్నో సంవత్సరాల పాటు అద్భుతమైన జోష్ లో కెరియర్ను ముందుకు సాగించింది. ఓ వైపు తెలుగు లో స్టార్ హీరోలతో నటిస్తూ వచ్చిన ఈ బ్యూటీ కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోల పక్కన హీరోయిన్గా నటిస్తూ అద్భుతమైన రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగించింది. ఇకపోతే వయస్సు పెరిగిన ఇప్పటికీ కూడా త్రిష కు  అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు.
 

ఓ వైపు తమిళ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో కెరీర్ను ముందుకు సాగిస్తున్న ఈ బ్యూటీ తెలుగు లో కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ప్రస్తుతం తెలుగు లో త్రిష , మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న విశ్వంభర అనే భారీ అంచనాలు కలిగిన సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే మళ్లీ తెలుగు లో త్రిష కు అవకాశాలు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. తాజాగా ఈ బ్యూటీ తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ స్పెషల్ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

సినిమాల్లో తన అందాలతో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండే త్రిష సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన యెల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన చీర పవిటను పక్కకు జరిపి తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం త్రిష కు సంబంధించిన ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: