శృతిహాసన్ పెళ్లి చేసుకోవాలనుకున్న హీరోయినా.. వింటుంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుందే అనుకుంటారు.. అంతేకాకుండా ఈ ఆర్టికల్ రాసే వాళ్ళు ఏదో పొరపాటు పడ్డట్టు ఉన్నారు.
హీరో అని పెట్టబోయి
హీరోయిన్ అని పెట్టింది అనుకుంటారు.. కానీ మీరు విన్నది నిజమే. అదేంటంటే..
శృతిహాసన్ అబ్బాయి అయితే కచ్చితంగా ఓ
హీరోయిన్ తో డేటింగ్ చేసి మరీ
పెళ్లి చేసుకునేదట.మరి ఆ
హీరోయిన్ ఎవరు. హీరోయిన్ ని ఎందుకు
పెళ్లి చేసుకోవాలి అనుకుంది అనేది ఇప్పుడు చూద్దాం..
శృతిహాసన్ అబ్బాయి అయితే కచ్చితంగా
పెళ్లి చేసుకోవాలి అనుకున్న
హీరోయిన్ ఎవరో కాదు మిల్కీ
బ్యూటీ తమన్నా.. అవును మీరు వినేది నిజమే. మిల్కీ
బ్యూటీ తమన్నా శృతిహాసన్ మధ్య ఫ్రెండ్షిప్ ఎలాంటిదో చెప్పనక్కర్లేదు.వీరు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్,ట్రిప్స్ వంటివి వేస్తూ ఉంటారు.
అంతేకాదు అప్పుడప్పుడు పార్టీలు, పబ్బులు అంటూ కూడా
తమన్నా,
శృతిహాసన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఇద్దరి మధ్య ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలాంటిది అంటే ఓ ఈవెంట్లో
శృతిహాసన్ కి ఒక షాకింగ్ ప్రశ్న ఎదురయ్యింది. మీరు ఒకవేళ అబ్బాయి అయితే ఏ
హీరోయిన్ తో డేటింగ్ కి వెళ్లేవారు అని ప్రశ్న ఎదురవగా.. నేను అబ్బాయి అయితే కచ్చితంగా తమన్నాతో డేటింగ్ కి వెళ్ళేదాన్ని.. డేటింగ్ మాత్రమే కాదు
పెళ్లి కూడా చేసుకునేదాన్ని..
తమన్నా చాలా మంచి అమ్మాయి.
నేనే కనుక అబ్బాయిని అయితే తమన్నాని అంత సులువుగా వదులుకునే వాడిని కాదు.. అంటూ
శృతిహాసన్ ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది. ఇక సమయం దొరికినప్పుడల్లా
శృతిహాసన్ తమన్నా ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూ ఉంటారు. అలా తమన్నాతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా
శృతిహాసన్ అబ్బాయి అయితే తమన్నాని
పెళ్లి కూడా చేసుకునే దాన్ని అంటూ ఇచ్చిన ఆన్సర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ విషయం
శృతిహాసన్ ఎప్పుడో చెప్పింది కానీ మళ్ళీ ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది