వేదం సినిమాలో మనోజ్ గర్ల్‌ఫ్రెండ్ గుర్తుందా.. ఇప్పుడు ఎలా మారిందంటే..?
2010లో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం మూవీనే లేఖా వాషింగ్టన్కు ఫస్ట్ సినిమా. బన్నీ, మంచు మనోజ్, అనుష్క, లేఖా వాషింగ్టన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు కానీ ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఎంత బాగుందంటే అందులో నటించడానికి అనుష్క చాలా ఆసక్తి చూపించింది అప్పట్లో ఆమె అరుంధతి లాంటి హిట్స్ అందుకుని అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. అయినా సరే ఇందులో ఒక వేశ్య పాత్ర వేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో బన్నీ లవర్‌గా దీక్షా సేథ్ కూడా నటించింది. మనోజ్ లవర్గానేమో లేఖా యాక్ట్ చేసింది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మకు చాలా మంచి పేరు వచ్చింది కానీ ఎందుకో ఆమె సినిమాలో క్లిక్ కాలేకపోయింది.
వేదం తర్వాత కమినా, డైనమైట్ సినిమాల్లో నటించింది కానీ ఆమె చిన్న వేషాలు మాత్రమే వేసింది దానివల్ల గుర్తింపు రాలేదు. లేఖా చెన్నైలో డ్రామాటిస్ట్గా రాణించింది. 2008లో జయమకొండాన్ సినిమాతో కోలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంది. ఆ తర్వాత వేదం, వా చిత్రాల్లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం లేఖా వాషింగ్టన్ సినిమాలకు పూర్తిగా దూరమైంది. అజ్జీ అనే ప్రొడక్ట్ డిజైన్ కంపెనీ ప్రారంభించే ఆ వ్యాపారంలోనే కొనసాగుతోంది. అయితే ఈ ముద్దుగుమ్మకు సంబంధించి కొన్ని ఇన్‌స్టా వీడియోలు, పిక్స్ వైరల్ గా మారాయి. అందులో ఆమె చాలా కొత్తగా మారిపోయింది ఆమె న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. https://www.instagram.com/reel/CX8IYCgode8/?utm_source=ig_web_copy_link లింక్ మీద క్లిక్ చేసి ఆమె వీడియో చూడవచ్చు.