ఏపీ: హిందూపురంలో బాలయ్యకు షాక్.. వ్యతిరేకంగా ఆందోళన..!

frame ఏపీ: హిందూపురంలో బాలయ్యకు షాక్.. వ్యతిరేకంగా ఆందోళన..!

Divya
హిందూపురం ప్రజలు బాలయ్యని ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎంచుకొని గెలిపించారు. దీంతో బాలయ్య హిందూపురం ప్రజల మీద కూడా వినలేని అభిమానంతో ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఉపయోగపడే పనులతో బాలయ్య పైన ఎలాంటి వ్యతిరేకత ఉండేది కాదు.. కానీ ఇప్పుడు తాజాగా అందుకు భిన్నంగా నందమూరి బాలకృష్ణ పైన రైతులు సైతం ఆగ్రహాన్ని తెలియజేసేలా ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు హిందూపురంలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం. హిందూపురంలో టిడిపి నేతలు తీరును సైతం రైతులు తప్పుపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి హిందూపురంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందనే విషయానికి వస్తే.. టిడిపి నేతలు కొంతమంది కబ్జాలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారట .వారిని కంట్రోల్ చేయాలంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా హిందూపురం పోలీస్ స్టేషన్ వద్ద కూడా రైతులు ఆందోళన చేయడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల రూ .2కోట్ల రూపాయలు విలువైన ఒక భవనాన్ని రైతులకు సంబంధించిన వాటిని టిడిపి నేతలు కూల్ చేశారట. వీటి పైన కూడా అక్కడికి రైతులు ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.

ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటే బాలయ్య ఎందుకు జోక్యం చేసుకోలేదంటూ ప్రశ్నిస్తున్నారు రైతులు. ఈ విషయం తెలిసి రైతులు బాలయ్యకు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా బాలయ్య అందుబాటులో లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. 1938 లోని సుమారుగా 177 మంది పాడి రైతులు కలిసి ఒక స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడ సొసైటీ భవనాన్ని సైతం నిర్మించారట. అక్కడి నుంచే సుమారుగా అప్పట్లోనే 1000 లీటర్ల పాలను కూడా అమ్మేవారిని తెలియజేస్తున్నారు. గడిచిన ఐదేళ్ల క్రితం టిడిపి నేతలు ఈ భవనాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ వైసిపి ప్రభుత్వం రావడంతో అది కుదరలేదని కానీ ఇప్పుడు మళ్లీ టిడిపి ప్రభుత్వం రావడంతో కొంతమంది నేతలు ఇలా ఆక్రమించుకోవాలని చూస్తున్నారంటూ ధర్నా చేస్తున్నారు రైతులు. ఈ విషయం పైన బాలయ్య రియాక్ట్ అవుతారో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: