తమిళ నటుడు
విజయ్ తాజాగా ది గోట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో మీనాక్షి
చౌదరి హీరోయిన్గా నటించగా ... వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ లో
విజయ్ రెండు పాత్రలలో నటించాడు. ఒక పాత్రలో తండ్రిగాను , మరొక పాత్రలో కొడుకు గాను నటించాడు. ఈ
మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ
మూవీ కి సంబంధించిన 4 రోజుల
బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ కి 4 రోజుల్లో
తమిళ నాడు ఏరియాలో 106.40 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10.10 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 21.10 కోట్ల కలెక్షన్లు రాగా ,
కేరళ ఏరియాలో 10.70 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ
మూవీ కి మొదటి రోజు 13.90 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 120.15 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ
మూవీ కి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 138.05 కోట్ల షేర్ ... 282.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ
మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ
మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో
బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ
మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 48.95 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. ఇక ఈ సినిమాకు
తమిళ నాడు , ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు వస్తున్న ఇతర ప్రాంతాల్లో మాత్రం ఈ
మూవీ ఆ స్థాయి కలెక్షన్లను రాబట్టడంలో చాలా వరకు వెనకబడిపోయింది.