‘హనుమాన్’
మూవీ ఫేమ్
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో
బాలయ్య వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఓ
సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా మోక్షు బర్త్ డే రోజు ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ వదిలారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ అంతా ఈ
సినిమా గురించే డిస్కస్ చేసుకుంటున్నారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందనున్న ఈ
సినిమా మైథలాజికల్
జోనర్ లో ఉండబోతుంది.దీంతో
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ
మూవీ కోసం స్టార్ కాస్ట్ ను తీసుకుంటున్నారట. ముఖ్యంగా టెక్నీకల్ పరంగా బ్రిలియంట్ గా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు టాక్. ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ
మూవీ కోసం మ్యూజిక్
డైరెక్టర్ గా
థమన్ పేరు టాప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ
సినిమా కోసం
థమన్ ను స్వయంగా బాలయ్యే సజెస్ట్ చేశారనే ప్రచారం కూడా సాగుతోంది.కొడుకు ఫస్ట్
మూవీ కాబట్టి సాంగ్స్ తో పాటూ బీజీయం కూడా ఓ రేంజ్ లో ఉండాలి. అందులో
థమన్ స్పెషలిస్ట్ కావడంతో ఆయనే మోక్షు సినిమాకు మ్యూజిక్
డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గత కొన్ని సినిమాలుగా బాలయ్యకు
తమన్ మ్యూజిక్ పరంగా ది బెస్ట్ ఇవ్వడంతో.. ఇప్పుడు కొడుకు సినిమాకు సైతం అదే రిపీట్ అవ్వడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
టాలీవుడ్‌కు కొత్త వారసుడు పరిచయం కాబోతున్నాడు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో
హీరో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. అతడు మరెవరో కాదు నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞతేజ. శుక్రవారం మోక్షజ్ఞతేజ బర్త్‌డే సందర్భంగా అతడి డెబ్యూ మూవీని ఆఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. ఈ సినిమాకు హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ డెబ్యూ
మూవీ కోసం మోక్షజ్ఞ
తేజ యాక్టింగ్‌తో పాటు డ్యాన్సులు, యాక్షన్ సీన్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌లో ఈ
సినిమా ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం.అదే రోజు షూటింగ్‌తో పాటు హీరోయిన్, ఇతర నటీనటుల వివరాల్ని వెల్లడించబోతున్నట్లు తెలిసింది.