తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో లోకేష్ కనకరాజు ఒకరు. ఈయన ఇప్పటి వరకు కొన్ని సినిమాలకి దర్శకత్వం వహించగా దర్శకత్వం వహించిన ప్రతి సినిమా కూడా దాదాపు బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో ఈయన ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈ దర్శకుడు కొంత కాలం క్రితం కార్తీ హీరోగా ఖైదీ అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో కార్తీ క్రేజ్ మరింతగా పెరగగా , లోకేష్ కనకరాజ్ కి ఈ మూవీ తోనే మంచి గుర్తింపు వచ్చింది.
ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ అనే మూవీ ని రూపొందించాడు. సూర్య ఈ సినిమాలో రోలెక్స్ అనే పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా ఎండింగ్లో చాలా కొద్ది సమయమే సూర్య కనిపించిన ఈ సినిమా విజయంలో సూర్య పాత్ర ఎంతో కీలకమైన పాత్రను పోషించింది. ఇకపోతే కార్తీ హీరోగా ఖైదీ 2 , సూర్య హీరోగా రోలెక్స్ అనే సినిమాలను రూపొందించనున్నట్లు లోకేష్ కనకరాజ్ చెప్పుకొచ్చాడు. దానితో ఓ వైపు కార్తీ అభిమానులు ఆయన ఎక్కడికి వెళ్లినా కూడా ఖైదీ 2 ఎప్పుడు అనే ప్రశ్నను అడగడం , దానితో ఆయన ఏదో ఒక జవాబు చెప్పి తప్పించుకోవడం జరుగుతుంది.
ఇక సూర్య హీరోగా రోలెక్స్ అనే పాత్రతో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే దానిపై కూడా ఆయన అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక వీరిద్దరితో సినిమాలు చేయకుండా లోకేష్ మాత్రం వేరే హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. దానితో కార్తీ , సూర్య ఇరకాటంలో పడిపోయారు. మరి లోకేష్ వీరితో ఎప్పుడు సినిమాలను రూపొందిస్తాడా అని వీరిద్దరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.