చిరుతో ఆల్మోస్ట్ సినిమా ఓకే.. చివరి నిమిషంలో క్యాన్సల్.. ఆ ఇద్దరి దర్శకుల పరిస్థితి అదే..?

frame చిరుతో ఆల్మోస్ట్ సినిమా ఓకే.. చివరి నిమిషంలో క్యాన్సల్.. ఆ ఇద్దరి దర్శకుల పరిస్థితి అదే..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేయడానికి ఈ తరం దర్శకులు కూడా ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ చిరంజీవి మాత్రం ఓ దర్శకుడితో సినిమా చేయాలి అంటే కచ్చితంగా కథ పర్ఫెక్ట్ గా ఉంటేనే సినిమా చేయడానికి ఇష్ట పడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో కొంత మంది దర్శకులతో చిరు సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన చివరి నిమిషంలో క్యాన్సల్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కొంత కాలం క్రితం చిరంజీవి టాలీవుడ్ ఇండస్ట్రీ లో యువ దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత చిరంజీవి , వెంకి కుడుముల కలిసి దిగిన ఒక ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది  దానితో వీరి కాంబోలో సినిమా ఆల్మోస్ట్ సెట్ అయింది అని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఎందుకో ఏమో తెలియదు కానీ వీరి కాంబోలో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. దానితో వెంకీ కుడుముల ప్రస్తుతం నితిన్ హీరోగా రాబిన్ హుడ్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో కళ్యాణ్ కృష్ణ ఒకరు. ఈయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ మూవీ రూపొందబోతున్నట్లు పోయిన సంవత్సరం చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరి కాంబోలో మూవీ క్యాన్సిల్ అయింది. ఇక కళ్యాణ్ కృష్ణ ఇప్పటివరకు ఏ మూవీ ని కూడా ఓకే చేయలేదు. ఇలా చిరు కోసం వెయిట్ చేసిన ఈ దర్శకులలో వెంకీ కుడుముల ప్రస్తుతం ఓ మూవీ చేస్తూ బిజీగా ఉంటే , కళ్యాణ్ కృష్ణ మాత్రం ఏ మూవీ ని ఓకే చేయకుండా ఖాళీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: