కొన్ని సంవత్సరాల క్రితం వరకు బాలీవుడ్ నటీమణులు తెలుగు సినీ పరిశ్రమను పెద్దగా పట్టించుకునేవారు కాదు. అలాగే తెలుగు సినిమాలు నటించడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు బాలీవుడ్ సినిమాల వైపు చూడడం , అక్కడ ఏ చిన్న అవకాశం దొరికిన వెంటనే ఆ సినిమాల్లో నటించడం చేస్తూ ఉండేవారు . కానీ ప్రస్తుతం పరిస్థితులు దాదాపు మారిపోయాయి. టాలీవుడ్ నటీమణులు కూడా ఎక్కువ శాతం బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఆసక్తిని చూపిం చడం లేదు . ఇక బాలీవుడ్ నటీమణులు టాలీవుడ్ సినిమాలలో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు .
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన ఎంతో మంది నటీమణులు ఇప్పటికే తెలుగు సినిమాలలో నటించారు. హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి ఆలియా భట్ కొంత కాలం క్రితం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది. ఇక హిందీ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ ఈమేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి దీపికా పదుకొనే , ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది.
ఇక హిందీ సినీ పరిశ్రమలో వరుస అవకాశాలతో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న జాన్వి కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబోలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్గా నటించడానికి రెడీగా ఉంది. ఇలా బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ తెలుగు సినిమాల్లో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నారు.