టాలీవుడ్ కొత్త‌ సినిమాలు భారీ రేట్లు... క‌ళ్లు చెదిరిపోవాల్సిందే...!

RAMAKRISHNA S.S.
రాబోయే నాలుగు నెలలు టాలీవుడ్‌లో భారీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. దేవర, పుష్ప 2, గేమ్ ఛేంజర్, విశ్వంభ‌ర‌ సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. ఈ అన్ని సినిమాల థియేటర్ హక్కులు భారీగా చెబుతున్నారు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర సినిమా హక్కులు రూ.55 కోట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అదికూడా సీడెడ్ కాకుండా.. మిగిలిన కోస్తా ఆంధ్రకు రూ.55 కోట్లు చెబుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ కావాలి. ఈ రేంజ్‌లో కలెక్షన్లు రావాలంటే...! బన్నీ - సుకుమార్.. పుష్ప 2 సినిమా సీడెడ్‌ కాకుండా మిగిలిన ఏపీ హక్కులు రూ.90 కోట్లు అడుగుతున్నారు. ఇది చాలా పెద్ద రేంజ్.

కల్కి మాదిరిగా భారీగా టికెట్లు పెంచితే తప్ప.. ఈ మేరకు వసూళ్ళు సాధ్యం కాదు. యూవీ క్రియేషన్స్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న భారీ సోషియాఫాంటసీ సినిమా విశ్వంభర. ఈ సినిమాను సింగిల్ పాయింట్‌లో హోల్సేల్గా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కూడా కోస్తా ఆంధ్రాలో సీడెడ్ కాకుండా రూ.60 కోట్ల వరకు రేటు పలుకుతుందని తెలుస్తోంది. ఇక అన్నింటితో పోల్చుకుంటే రామ్ చరణ్.. శంకర్ గేమ్ ఛేంజర్ రేటు కాస్త తక్కువగా ఉండొచ్చు.

ఎందుకంటే ప్రస్తుతం శంకర్ ఫామ్‌లో లేరు. దీనికి తోడు శంకర్ ఇటీవల కమల్ హాసన్‌తో తెర‌కెక్కించిన భారతీయుడు 2 సినిమా కూడా అంచనాలు అందుకోలేదు. పైగా గేమ్ ఛేంజ‌ర్ సినిమా చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటూ రావడంతో అంచనాలు కూడా తగ్గిపోయాయి. ఏది ఏమైనా రాబోయే నాలుగు నెలల టాలీవుడ్‌లో భారీ సినిమాలు ఉన్నాయి. వీటితోపాటు బాబి - బాలయ్య సినిమా కూడా ఉంది. ఇక మీడియం రేంజ్ సినిమాలు చాలా ఉన్నాయి. అందువల్ల బయర్లు డబ్బులతో రెడీగా ఉంటే సినిమాలు కొనవచ్చు .. హిట్టయితే మంచి లాభాలు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: