దేవ‌ర ' హిందీ మార్కెట్ టార్గెట్ ఎంత‌... ఆ లెక్క ఇదే... !

RAMAKRISHNA S.S.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి దాదాపు రెండున్నర ఏళ్లు అయింది. ఎన్టీఆర్‌ను అభిమానులు ఎప్పుడెప్పుడు తెరమీద చూస్తామా అని ఒక్కటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈనెల 27న ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలవుతుంది. అంతకన్నా ముందు ఈనెల 10వ తేదీన దేవర 1 ట్రైలర్ వస్తోంది. రెండు నిమిషాల 50 సెకన్ల ట్రైలర్ను దర్శకుడు కొరటాల శివ కట్ చేసినట్టు తెలుస్తోంది. ట్రైలర్ను ముంబైలో మీడియా ముందు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

దేవర సినిమా రెండు పార్ట్‌లుగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ దేవరలో విలన్ గా నటిస్తున్నారు. మరో బాలీవుడ్ సీనియర్ హీరో బాబి డియోల్ మరో విధంగా కనిపించబోతున్నారు. ఇప్పుడు ట్రైలర్ ముంబైలో విడుదల చేయటం వెనుక‌ కూడా హిందీ మార్కెట్‌ను టార్గెట్ చేయడం ప్రధాన కారణం అని తెలుస్తుంది.

ఇక దర్శకుడు కొరటాల, హీరో ఎన్టీఆర్ కొన్ని ఇంటర్వ్యూలు అక్కడ మీడియాకి ఇస్తున్నారు. అలాగే మరో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.. హీరో ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేయబోతున్నారు. ఎందుకంటే బాలీవుడ్‌లో సందీప్‌కు చాలా క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్‌కు.. పాన్ ఇండియా భవిష్యత్‌కు త్రిబుల్ ఆర్ సినిమా కన్నా కూడా దేవరనే అసలైన పునాది. ఎందుకంటే త్రిబుల్ ఆర్ కు రాజమౌళి ఉండనే ఉన్నాడు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్‌ సినిమా ఉంటుంది. కనుక పెద్దగా సమస్య ఉండదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ నార్త్ లో ప్రూవ్ చేసుకుంటే.. ఇక ఫిక్స్ అయిపోతుంది. ఇక నార్త్ మార్కెట్ ఇప్పటికే ప్రభాస్, బన్నీ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా రామ్ చరణ్ కూడా నార్త్ మార్కెట్‌లో ప్రూవ్ చేసుకోవలసిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: