పిఠాపురం: పవన్ కు భారీ షాక్ తగలబోతోందా..?

Divya
రాజకీయాలు అంటే ఎవరూ కూడా శాశ్వత మిత్రులు శత్రువులు అని ఉండరని చెప్పవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నేతలు కూడా నిరూపించారు. కూటమిలో భాగంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా గెలుపొందారు.అలాగే పవన్ కళ్యాణ్ తన అడ్డాగా పిఠాపురాన్ని మార్చుకోబోతున్నట్లు ఆయన చుట్టూ ఉన్న పరిణామాలు చూస్తూ ఉంటే మనకి అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఎన్ని మలుపులు తిరిగాయో అన్నే మలుపులు పిఠాపురం రాజకీయం చుట్టూ తిరుగుతున్నాయి.

టిడిపి, జనసేన మద్య రోజుకి పిఠాపురంలో దూరం పెరుగుతూనే ఉన్నదట. అక్కడ స్థానికంగా జనసేన నేతలు టిడిపి పార్టీని దూరం పెట్టే ఆలోచనలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోందట. ప్రస్తుతం పిఠాపురంలో టిడిపి, జనసేన మధ్య విభేదాలు పిక్స్ కు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నియోజవర్గంలోని నేతలు కూడా రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడంతో స్థానికంగా ఉన్న టిడిపి నేత వర్మ కూడా అక్కడ తన సీటునీ త్యాగం చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా చాలానే కష్టపడ్డారు వర్మ.

ఎన్నికల సమయంలో తన గెలుపును వర్మ చేతిలో పెడుతున్నామంటూ ఎన్నో డైలాగులు చెప్పిన పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత వర్మ పేరును ఎక్కడా కూడా తీసుకురాలేదు. దీంతో అటు వర్మ అనుచరులు కూడా పవన్ ఫైర్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గడిచిన కొద్ది రోజుల క్రితం వర్మపైన జనసేన కార్యకర్తలు దాడి చేశారు. అటు కాకినాడ జనసేన ఎంపీ తో కూడా వర్మకు విభేదం పెరిగినట్లు ప్రచారం వినిపిస్తోంది.  వర్మను కూడా ఎలాంటి కార్యక్రమాలకు రానివ్వకుండా జనసేన నేతలు కార్యకర్తలు అడ్డుకుంటున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వర్మ కూడ ఎమ్మెల్సీ పదవి త్వరగా  తీసుకుని తన నియోజకవర్గంలో తన హవా కొనసాగించాలనే  ఆలోచనతో ఉన్నారట.. ముఖ్యంగా తన నియోజవర్గంలో జనసేనకు చెక్ పెట్టేలా వర్మ ఆలోచిస్తున్నట్లు సమాచారం. పిఠాపురంలో జనసేన పార్టీలోకి ఎంతోమంది చేరినా కూడ వర్మ ఏదో ఒక రూపంలో అందరికీ బ్రేక్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: