ఏంది బ్రో, గ్రాఫిక్స్ ఇంత చెత్తగా ఉంది.. దేవర ట్రైలర్ చూస్తే..
దేవర ట్రైలర్ రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ముంబైలో ఓ గ్రాండ్ ఈవెంట్ పెట్టి ఈ ట్రైలర్ విడుదల చేశారు. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేయనున్నాడు. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు. జాన్వీకపూర్ చందాలతో ఆకట్టుకోనుంది. అనిరుధ్ మ్యూజిక్ ఈ మూవీకి మరో హైలెట్. ఈ ట్రైలర్ లో ఈ అన్ని హైలెట్స్ స్పష్టంగా కనిపించాయి అయితే ఓ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నిరాశ పడిపోతున్నారు. అదేంటంటే ఈ మూవీ గ్రాఫిక్స్ చాలా చెత్తగా ఉంది.
ట్రైలర్లో బాంబ్ సీక్వెన్స్, షార్క్ ఫైట్ సీక్వెన్స్ కనిపించాయి. అయితే ఆ రెండు సన్నివేశాల్లో గ్రాఫిక్స్ చాలా పూర్ గా ఉంది. చీప్ చైనీస్ సినిమాల్లో కనిపించిన విధంగా ఈ గ్రాఫిక్స్ ఉండటంతో చాలామంది నవ్వుకుంటున్నారు మరి కొంతమంది ఏంటన్న ఇది అని ట్రోల్ చేస్తున్నారు. రూ.వందల కోట్ల బడ్జెట్ అని ఈ మూవీ మేకర్స్ డబ్బులు కొట్టుకున్నారు. కానీ ఆ రెండు షాట్స్ చూస్తుంటే ఇది ఏదో రెండు మూడు కోటలో తీసిన సినిమా లాగా అనిపిస్తుంది అసలు కనిపించడం లేదు. అయితే.. కేవలం ట్రైలర్ లో కనిపించిన రెండు సెకండ్ల విజువల్స్ తో ఫైనల్ ప్రోడక్ట్ కూడా అలాగే ఉంటుందని చెప్పలేం. హైప్ క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ట్రైలర్ లో ఆ షాట్స్ జోడించి ఉండవచ్చు కానీ ఇప్పుడు అవే మైనస్ అయ్యాయని చెప్పుకోవచ్చు.
పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తీస్తున్నామంటే అందరి ప్రేక్షకులకు నచ్చేలాగా సినిమా ఉండాలి లేకపోతే నవ్వులు పాలు కావడం పక్కా. దేవర ట్రైలర్లో సర చేప సరే చేప లాగా లేదు అదేదో డాల్ఫిన్ లాగా ఉంది. అందుకే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. ఈ సన్నివేశాలను మళ్లీ మంచి గ్రాఫిక్స్ తో రీక్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అని సలహా ఇస్తున్నారు. అయితే టైం చాలా తక్కువగా ఉంది మరి వాటిని అలాగే ఉంచేస్తారేమో అని చాలామంది అనుకుంటున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన వరల్డ్ వైడ్ గా దేవర సినిమా రిలీజ్ అవుతుంది. ఎవరో ఈ సినిమాతో స్పెషల్గా ఎంట్రీ ఇవ్వనున్నారట. ఆ వ్యక్తి ఎవరనేది ప్రస్తుతం ఆ టాపిక్ గా మారింది.