కోలీవుడ్ ఫేమస్ హీరో జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్టు సోమవారం తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్ గా బయట పెట్టేశారు. మా వ్యక్తిగత విషయాల కారణంగానే మేము విడాకులు తీసుకుంటున్నామని,ఈ విషయంలో ఎవరు ఎలాంటి దుష్ప్రచారాలు చేయకండి అంటూ విడాకుల విషయాన్ని బయటపెట్టారు. అలాగే పరస్పరం అన్ని ఆలోచించుకున్నాకే ఈ విడాకులు ప్రకటించామని చెప్పారు. దీంతో చాలామంది ఆయన అభిమానులు షాక్ లో మునిగిపోయారు. 15 ఏళ్ళు సంసారం చేసిన వీరి జీవితంలో ఎక్కడ గొడవ వచ్చింది,వీరి మధ్య చిచ్చు పెట్టింది ఎవరు? అసలు వీరి విడాకులకు కారణం ఏంటి అని చాలామంది వీరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇక జయం రవి ఆర్తి విడిపోవడానికి కొంతమంది ఓ హీరో పేరు ప్రచారం చేస్తే మరి కొంతమందేమో ఓ హీరోయిన్ పేరు ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎవరి రూమర్స్ వారు వైరల్ చేస్తున్న వేళ తాజాగా జయం రవి భార్య నా ప్రమేయం లేకుండానే విడాకులు అనౌన్స్ చేశాడు.
అదంతా దుష్ప్రచారం నమ్మకండి అంటూ పెద్ద బాంబు పేల్చింది.ఇక విషయంలోకి వెళ్తే.. ఆర్తి,జయం రవిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.వీరి పెళ్ళై దాదాపు 15 సంవత్సరాలు గడుస్తోంది.అలాగే వీరి అన్యోన్య జీవితానికి గుర్తుగా ఇద్దరూ కుమారులు కూడా జన్మించారు. ఎంతో హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలో గత కొద్ది రోజులుగా విడాకుల రూమర్లు వినిపిస్తున్నాయి.కానీ ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా జయం రవి ఫోటోలన్నీ తన ఇన్స్టానుండి ఆర్తి డిలీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత ఊపందుకున్నాయి. కానీ ఆ తర్వాత అనూహ్యంగా ఆర్తి తన భర్త మొదటి సినిమా అయినా జయం మూవీకి సంబంధించిన పోస్టర్ పెట్టి 21 సంవత్సరాలు గడిచింది అని పోస్ట్ చేసింది.దీంతో డివోర్స్ వార్తలు ముగిశాయి.కానీ తాజాగా జయం రవి తన భార్యతో విడాకులు తీసుకున్నట్టు స్వయంగా ప్రకటించేసరికి మరో పచ్చని కాపురం విడిపోయింది అని చాలామంది బాధపడ్డారు.
అయితే తాజాగా విడాకులపై మొదటిసారి స్పందించింది ఆర్తి.తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.అయితే ఆ పోస్టులో నా భర్త నా ప్రమేయం లేకుండానే ఈ విడాకుల వార్తలను బయట పెట్టడం వల్ల నేను దిగ్భ్రాంతికి గురయ్యాను విచారం వ్యక్తం చేస్తున్నాను.అలాగే ఈ విడాకుల విషయంపై నా భర్తతో మాట్లాడదాం అనుకున్నా కూడా ఛాన్స్ దొరకలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ విడాకుల విషయంలో చాలామంది నన్ను నా వ్యక్తిత్వం పై ఎన్నో చెడు ప్రచారాలు చేస్తున్నారు.ఆ దుష్ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదు. ఇలాంటి కష్ట సమయంలో నేను బాధనంతా దిగమింగుకొని నా పిల్లలపై పూర్తి ఫోకస్ పెడతాను అంటూ సంచలన పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్స్ విడాకులపై ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది.. విడాకులు వచ్చేవి కావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.