పెళ్లయిన హీరోతో రిలేషన్ లో సంయుక్త మీనన్?
ఆ సినిమా అనంతరం వరుసగా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న సంయుక్త సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వరుస పెట్టి ఫోటో షూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం సంయుక్తకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
ఈ బ్యూటీ కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో ప్రేమాయణం నడుపుతోందట. ఆ హీరోకి ఇదివరకే ఓ అమ్మాయితో ప్రేమ పెళ్లి జరిగిందని... అంతేకాకుండా వారు విడాకులు కూడా తీసుకున్నారని సమాచారం. ఇక ఆ హీరో ఒప్పుకుంటే అతడిని వివాహం చేసుకోవాలని సంయుక్త ఫిక్స్ అయిందట. ఆ హీరోకి కూడా సంయుక్త అంటే విపరీతమైన ఇష్టం ఉందని టాక్. వీరిద్దరూ కలిసి గతంలో ఓ సినిమాలో నటించారట. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్లిందని టాక్.
ఈ విషయం తెలిసి సంయుక్త అభిమానులు కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వివాహం చేసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. అది కూడా పెళ్లయిన ఓ వ్యక్తిని చేసుకోవడం అవసరమా అని కామెంట్లు చేస్తున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.