కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాల్లో హీరోయిన్లుగా నటించే పర భాష నటీ మణులకు ఎక్కువ శాతం ఎవరో ఒకరు డబ్బింగ్ చెబుతూ ఉండేవారు. ఇక అలా చెబుతూ ఉండటంతో కొత్త హీరోయిన్లు కూడా తమ పాత్రకు తాము డబ్బింగ్ చెప్పుకోవడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. చాలా మంది యువ నటి మణులు , కొత్త నటీమణులు కాస్త కష్టం అయిన సరే తమ డబ్బింగ్ ను తామే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక కొంత మంది మాత్రమే ఇప్పటికి కూడా డబ్బింగ్ చెప్పకుండా తప్పించుకుంటున్నారు.
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటీమణులలో జాన్వీ కపూర్ ఒకరు అనే విషయం మనకు తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కాబోతోంది. ఇకపోతే దేవర మూవీ తెలుగు డబ్బింగ్ ఈమె చెప్పుకుంటుందేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల అయింది. ఇందులో జాన్వి కపూర్ కు సంబంధించిన ఒకటి , రెండు డైలాగులు ఉన్నాయి. ఆ డైలాగులు వింటుంటేనే అర్థం అవుతుంది ఈ ముద్దుగుమ్మ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోలేదు అని.
ఇకపోతే యాంకర్ గా నటిగా ఫుల్ బిజీగా కెరీర్లు ముందుకు సాగిస్తున్న అనసూయ దేవర మూవీలో జాన్వి పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి జాన్వి కి అనసూయ చెప్పిన డబ్బింగ్ ఫర్ఫెక్ట్ గా సెట్ అయినట్లు అయితే తదుపరి మూవీ లకు కూడా ఈ ముద్దుగుమ్మ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉంది. జాన్వి కపూర్ "దేవర 2" సినిమాలో నటించడానికి రెడీగా ఉంది. అలాగే రామ్ చరణ్ , బుచ్చిబాబు కాంబోలో సినిమాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతోంది. మరి జాన్వీ కి అనసూయ డబ్బింగ్ సెట్ అయితే అనసూయ కి కూడా అదిరిపోయే ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది.