తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తళపతి విజయ్ తాజాగా ది గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజే తమిళనాడు , ఓవర్సీస్ రెండు ప్రాంతాల్లో మినహాయిస్తే అన్ని ప్రాంతాల్లో నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఈ రెండు ప్రాంతాల నుండి ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 6 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలు తెలుసుకుందాం.
ఈ మూవీ కి 6 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 131.60 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 22.85 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 11.45 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 16.25 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 126.65 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 156.60 కోట్ల షేర్ ... 320.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 30.40 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ మూవీ కి కేవలం తమిళనాడు , ఓవర్సీస్ నుండే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఏ మూవీ కి భారీ కలెక్షన్లు రానట్లయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ ను అందుకునే పరిణామాలు ఉండేది.