ఆ విషయంలో మలయాళం ను పక్కన పెట్టేసిన తారక్.. మిగతా వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్..?

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా ప్రేక్షకులను పలకరించి చాలా కాలం అవుతుంది. ఆఖరుగా జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా అరవింద సమేత అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఇకపోతే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర" సినిమాలో హీరోగా నటించాడు.

సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా చాలా సంవత్సరాల తర్వాత విడుదల అవుతూ ఉండడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనంద పడుతున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. మొత్తం ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా జూనియర్ ఎన్టీఆర్ పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక మలయాళ భాషకు తప్పిస్తే మిగిలిన నాలుగు భాషలకు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

మరి మలయాళ భాష కు డబ్బింగ్ చెప్పకపోవడానికి ప్రధాన కారణం ఈ సినిమా విడుదలకు ఎక్కువ సమయం లేకపోవడం అయి ఉండొచ్చు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ భారీ స్థాయిలో ఈ సినిమా ప్రచారాలను నిర్వహిస్తున్నాడు. ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: