అనిరుధ్‌పై కొర‌టాల గ‌రంగ‌రం... నీకు చెప్పిందేంటి... చేసిందేంటి..?

RAMAKRISHNA S.S.
ఒక క్రేజీ ప్రాజెక్టుకు కావాలని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ను తెచ్చుకున్నాక తర్వాత ఏమి చేసే పరిస్థితులు కనబడటం లేదు. సరైన సంగీతం అందిస్తే సూపర్ అనుకోవటం .. లేదంటే బాధపడటం చేతులు ఎత్తేయటం. అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ మంచి సంగీత దర్శకుడు .. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అనిరుధ్‌ తమిళ సినిమాలకు ఇచ్చిన రేంజ్ మ్యూజిక్ ఎందుకో తెలుగు సినిమాలకు ఇవ్వటం లేదన్న విమర్శలు ఉన్నాయి. గతంలో ఏఆర్ రెహమాన్ - హరీష్ జయరాజ్ - యువన్ శంకరరాజా తమిళంలోనూ సూపర్ హిట్ లు ఇచ్చారు. తెలుగులోనూ సూపర్ హిట్ లు ఇచ్చారు. హరీష్ జయరాజ్ తెలుగులో చేసిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ అజ్ఞాతవాసి సినిమాకు ఇచ్చిన పాటలే తెలుగులో ది బెస్ట్. ఆ తర్వాత కొంతలో కొంత గ్యాంగ్ లీడర్ ... లేటెస్ట్ గా ఎన్టీఆర్ దేవర సినిమాకు కూడా రెండు మంచి పాటలు ఇచ్చాడు.

హీరోయిజం సాంగ్ బాగానే ఉంది .. ఒక డ్యూయెట్ కానీ మంచి పాపులర్ అయ్యాయి కానీ మూడోపాట్ల మాత్రం జనాలకు అస్సలు నచ్చలేదు. ఆయుధ పూజ సాంగ్ ఉంది .. అది సూపర్ గా ఉంటుందని టాక్ ఉంది. ఇదిలా ఉంటే దావూదీ పాట విషయంలో అభిమానులతో పాటు అందరి నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. దాంతో ఈ పాటను తీసుకెళ్లి రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేశారట. ఈ విషయంలో సన్నిహితులు దర్శకుడు కొరటాల దగ్గర ప్రస్తావిస్తే ఏం చేస్తాం ... అలాంటి పాట ఇచ్చాడు అని కొరటాల నిట్టూర్చార‌ట. ట్రైలర్లో నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది అని చెప్పలేం ... అద్భుతంగా ఏమాత్రం లేదు ... ఏదో సోసో గా ఉంది. ఏది ఏమైనా ఇప్పటివరకు దేవర సినిమా కంటెంట్‌కు అనిరుధ్‌ ఇచ్చిన మ్యూజిక్ మరి అంత గొప్పగా లేదు అన్నది మాత్రం వాస్తవం.

మరి సినిమాలో ఈ జనరేషన్ కోరుకునే కొత్త కొత్త సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందేమో చూడాలి. అలా ఉంటేనే సినిమాకు మ్యూజిక్ పెద్ద హెల్ప్ అవుతుంది.. ఏది ఏమైనా దేవర అవుట్ పుట్ విషయంలో అనిరుధ్ పై కొరటాల అసంతృప్తితోనే ఉన్నాడని .. చాలా నిరాశతో ఉన్నారన్న ప్రచారం అయితే టాలీవుడ్ వరకు సర్కిల్స్ లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: