కోలీవుడ్లో నయనతార కు చెక్ పడినట్లేనా.. జాగ్రత్త పడకుంటే ఇక అంతే..?

frame కోలీవుడ్లో నయనతార కు చెక్ పడినట్లేనా.. జాగ్రత్త పడకుంటే ఇక అంతే..?

Pulgam Srinivas
తెలుగు , తమిళ పరిశ్రమలలో ఏకకాలంలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో నయనతార ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఓ వైపు తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ వరస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తూనే మరో వైపు తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పక్కన నటిస్తూ మంచి విజయాలను అందుకుంటు కోలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అదే స్థాయిలో కెరియర్ను కొనసాగించింది. అలా రెండు ఇండస్ట్రీలలో తిరుగులేని నటిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీని కాస్త పక్కన పెట్టేసి కోలీవుడ్ ఇండస్ట్రీ పై ఎక్కువ ఇంట్రెస్ట్ ను పెట్టడం మొదలు పెట్టింది.

అందులో భాగంగా ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో మంచి విజయాలు దక్కడంతో ఈమె ఇప్పటికీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులను ఎక్కువ శాతం ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం వైవిధ్యమైన సినిమాలలో , లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇలా కోలీవుడ్లో తిరుగులేని హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న నయనతారకు త్రిష ద్వారా కొత్త సమస్య మొదలయింది.

త్రిష కూడా నయనతార లాగానే తెలుగు , తమిళ పరిశ్రమలలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలో తెలుగును పక్కన పెట్టి తమిళ సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. కానీ నయనతార స్థాయిలో ఈమె కెరియర్ను ముందుకు సాగించలేదు. కానీ ప్రస్తుతం మాత్రం ఈమె నయనతారను బీట్ చేసి ముందుకు వెళుతుంది. వరస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక నయనతార ప్రస్తుతం ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టకపోతే త్రిష నయనతార ను ఈజీగా బీట్ చేసే అవకాశం ఉంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: