ఈ
మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని
సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ లో
ఎన్టీఆర్ సరసన
జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ
మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇకపోతే
ఎన్టీఆర్ తో కేవలం ఒకే ఒక సినిమాలో నటించిన
జాన్వి తన గురించి అద్భుతమైన విషయాలను తాజాగా చెప్పుకొచ్చింది. తాజాగా
జాన్వి ,
ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ...
ఎన్టీఆర్ తో
సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఒక గొప్ప హార్డ్ వర్కర్. ఆయనతో పని చేసిన తర్వాత ఆయనకు ఫ్యాన్ అయిపోయాను.
దేవర మాత్రమే కాదు మరిన్ని సినిమాల్లో
ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉంది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా
జాన్వి చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇప్పటివరకు దేవర సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను ఈ
మూవీ బృందం విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ
మూవీ ని తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో పాన్
ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు.