తనను కాకుండా ఆ కాంబినేషన్ ను నమ్ముకున్న నాని.. మరో హిట్ దక్కేనా..?

frame తనను కాకుండా ఆ కాంబినేషన్ ను నమ్ముకున్న నాని.. మరో హిట్ దక్కేనా..?

Pulgam Srinivas
నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆగస్టు 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకుంటుంది. ఈ మూవీ కి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా ... ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విడుదల అయిన కొన్ని రోజులకే నాని , శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ కి సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోని విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్ జనాల నుండి లభించింది.

ఇక నాని మరికొన్ని రోజుల్లోనే శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కూడా ఓ మూవీ నీ నాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇలా శిలేష్ కొలను దర్శకత్వంలో ఓ మూవీ , శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ కి కమిట్ అయ్యి ఉన్న నాని మరో క్రేజీ దర్శకుడి సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల తాజాగా నాని ని కలిసి ఒక కథను వివరించినట్లు , అది బాగా నచ్చడంతో నాని , శేఖర్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి నీ హీరోయిన్ గా తీసుకోవాలి అని శేఖర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో శేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఫిదా , లవ్ స్టోరీ సినిమాలలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

ఇక నాని హీరోగా రూపొందిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకుంది. ఇలా ఈ హిట్ కాంబోలో మరి కొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం శేఖర్ కమ్ముల , ధనుష్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా కుబేర మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: