తేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా.. మరోసారి ఆ ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్..?

frame తేజ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా.. మరోసారి ఆ ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్..?

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటులలో తేజ సజ్జ ఒకరు. ఈయన ఆఖరుగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో తేజ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తేజ ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న మిరాయ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ భారీ బడ్జెట్లో రూపొందుతుంది.

ఇలా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్న తేజ తన నెక్స్ట్ మూవీ ని పెద్దగా క్రేజీ లేని దర్శకుడితో చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం తేజ "అద్భుతం" అనే ఓ సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పెద్ద స్థాయిలో రెస్పాన్స్ లభించలేదు. ఈ మూవీ కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.

ఇకపోతే మళ్లీ మల్లిక్ రామ్ దర్శకత్వంలో తేజ మరో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూవీ ఆల్మోస్ట్ సెట్ అయినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే హనుమాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తేజ నటిస్తున్న సినిమా కావడంతో మీరాయ్ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: