ముదురు భామల వెంట పడుతున్న స్టార్ హీరో.. ఈసారి ఏకంగా ఆమె పక్కనా..?

frame ముదురు భామల వెంట పడుతున్న స్టార్ హీరో.. ఈసారి ఏకంగా ఆమె పక్కనా..?

Pulgam Srinivas
దాదాపు స్టార్ హీరోలు అంతా కూడా తమ వయసుకు సంబంధం లేకుండా యంగ్ హీరోయిన్లతో నటిస్తూ ఉంటారు. ఇక కొంత మంది విషయంలో జనాలు అతని వయసు ఎంత ..? ఆ అమ్మాయి వయసు ఎంత ..? వారిద్దరి జంట అసలు బాగోలేదు. కొంత ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో అతను నటిస్తే బాగుంటుంది. అని కొంత మంది హీరోల విషయంలో నెగిటివ్ కామెంట్స్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే తమిళ నటుడు తలపతి విజయ్ మాత్రం స్టార్ హీరోలలో చాలా మంది కి వ్యతిరేకమైన రూట్ లో వెళుతున్నాడు. ఇకపోతే ఈయన దాదాపు తన వయసుకు దగ్గర ఉన్న హీరోయిన్లతోనే సినిమాలు ఈ మధ్య కాలంలో చేస్తున్నాడు.

కొంత కాలం క్రితం విజయ్ "లియో" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో త్రిష విజయ్ కి జోడిగా నటించింది. తాజాగా విజయ్ "ది గోట్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఒక పాత్రలో విజయ్ తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇకపోతే తండ్రి పాత్రలో కనిపించిన విజయ్ కి జోడిగా స్నేహ నటించింది. ఇలా ఎక్కువ శాతం సీనియర్ హీరోయిన్లతో నటిస్తున్న విజయ్ మరోసారి మరో సీనియర్ హీరోయిన్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ నెక్స్ట్ మూవీ లో సిమ్రాన్ హీరోయిన్గా కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈమెను విజయ్ నెక్స్ట్ మూవీ లో హీరోయిన్గా తీసుకోవడానికి మూవీ బృందం వారు ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే విజయ్ తన వయసుకు దగ్గర ఉన్న నటిమనులతో నటిస్తూ ఉండడంతో తమ హీరో ఎంతో గ్రేట్ అంటూ విజయ్ అభిమానులు ఆనంద పడుతున్నారు. ఇలా విజయ్ తన వయసుకు దగ్గర ఉన్న నటీమణులతో నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: