నేడు చంద్రబాబును కలవనున్న ఎన్టీఆర్.. అందుకోసమేనా..?

murali krishna
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, తెలంగాణ లో ఖమ్మం వరదల ముంపుకు గురి అయినా సంగతి తెల్సిందే.ఆ వరదల ధాటికి దాదాపు రెండు అంతస్తు వరకు నీరు రావడం తో కట్టుబట్టలతోనే ప్రజలంతా మిగిలిపోయారు.దీంతో వారికి సాయంగా చాలా మంది ప్రముఖులు ముందుకొచ్చి సాయం ప్రకటించారు. అలా రామ్‌చరణ్, ఎన్టీఆర్ కూడా సాయం ప్రకటించారు.సీఎం చంద్రబాబు పిలుపుమేరకు వరద సాయం కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి తార‌క్‌, రామ్ చరణ్‌లు  వీరిద్దరూ ఏపీకి చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళం అందిస్తామ‌ని ఎక్స్ వేదిక గా ప్రకటించారు.ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశమై  ఆ చెక్‌ ను నేరుగా ఇవ్వబోతున్నారు.త్వరలోనే రేవంత్ రెడ్డితో కూడా సమావేశం అయ్యే ఛాన్స్ ఉంది. హీరో రామ్‌చరణ్ కూడా రాష్ట్రానికి యాభై లక్షలు చొప్పున ప్రకటించారు. వరద బాధితులకు అండగా నిలవడంలో తన వంతు సాయం చేశారు. ఈ చెక్‌ను సీఎం చంద్రబాబు తో సమావేశమై అందజేయనున్నారు.
 
చాలాకాలం తర్వాత సీఎం చంద్ర‌బాబు తో ఎన్‌టీఆర్ భేటీ కానుండ‌డం సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది.టీడీపీ, ఎన్టీఆర్ మధ్య ఎప్పటి నుంచో గ్యాప్ ఉంది. పార్టీకి, ఫ్యామిలీ కార్యక్రమాల్లో ఎన్టీఆర్, చంద్రబాబు కలుసుకున్నది చాలా తక్కువ. అలాంటి సందర్భాల్లో కలుసుకున్నప్పటికీ మాట్లాడుకున్నది కూడా అరుద. అందుకే ఇప్పుడు చంద్రబాబుతో ఎన్టీఆర్ సమావేశమంటే చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. చంద్రబాబు అరెస్టు టైంలో కూడా స్పందించలేదని, ఆయన ఫ్యామిలీపై మాటల దాడి చేసినప్పుడు అండగా నిలబడలేదని జూనియర్ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.ఇదిలావుండగా ఉండవల్లి నివాసం లో చంద్రబాబును శుక్రవారం ఉదయం 11 గంటల కు వీరి భేటీ వుంటుంది.
ఇకపోతే ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం దేవర పార్ట్ - 1యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతోంది.అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదలకు సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: