ప్రభాస్ వల్ల రెండు సార్లు బాధపడ్డాను.. రకుల్..?

frame ప్రభాస్ వల్ల రెండు సార్లు బాధపడ్డాను.. రకుల్..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రకుల్ ప్రీత్ సింగ్ "వెంకటాద్రి ఎక్స్ ప్రెస్" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. సందీప్ కిషన్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడం , ఇందులో రకుల్ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో వరుసగా అవకాశాలు వచ్చాయి. దానితో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలలో కంటే తమిళ్ , హిందీ మూవీలలో నటించడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా రకుల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమెకు కెరియర్ ప్రారంభంలో ఎదురైన ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చింది. తాజాగా రకుల్ మాట్లాడుతూ... సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ మొదలు పెట్టిన కొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాను. కెరియర్ ప్రారంభించిన కొత్తలో ప్రభాస్ హీరోగా రూపొందే ఓ సినిమాలో నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఇక సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు. దాదాపు నాలుగు రోజుల షూటింగ్ కూడా పూర్తి అయింది. ఆ తర్వాత ఎందుకో ఏమో తెలియదు కానీ నన్ను ఆ సినిమా నుండి తీసేసారు.

ఇక ఆ తర్వాత కూడా ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆఫర్ నా చేయి జారిపోయింది. ఇక ఆ సినిమాలో కూడా ప్రభాస్ హీరో అని తెలిసింది. అలా రెండు సార్లు ప్రభాస్ హీరోగా రూపొందబోయే సినిమాలో ఆఫర్ మిస్ అయినందుకు చాలా బాధపడ్డాను అని రకుల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే తాజాగా రకుల్ "ఇండియన్ 2" సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: