ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ కాంబినేషన్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి ఇండియా లోనే నెంబర్ 1 దర్శకుడిగా రాజమౌళి మారారు కాబట్టి తన తదుపరి చిత్రం ఆటోమేటిక్ గా బిగ్గెస్ట్ సినిమా అయ్యి తీరుతుంది.ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ లోకి తీసుకెళ్లడానికి జక్కన్న ఎంత కష్టపడ్డాడో ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో తన వెబ్ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఉన్న డాక్యుమెంటరీ చూస్తే అర్ధం అవుతుంది. కాగా ఇలాంటి దర్శకుడుతో ఓ టాప్ స్టార్ తో సినిమా అంటే అంచనాలు ఖచ్చితంగా ఎక్కువగానే ఉంటాయి కానీ ఆ సినిమా తాలుకా క్రెడిట్ ని ఒక్క హీరోకి మాత్రమే పరిమితం చెయ్యాలని అనుకోవడం ఖచ్చితంగా వెర్రితనమే అవుతుంది.కాగా ప్రస్తుతానికి మహేష్, రాజమౌళి సినిమాని 'SSMB29' అంటూనే సంబోధిస్తున్నారు. అంటే ఇది మహేష్ బాబు కెరీర్ లో 29వ సినిమా అని ఓ ట్యాగ్ అయితే ప్రస్తుతానికి ఉంది. కానీ ఈ ట్యాగ్ ని జక్కన కాంపౌండ్ కొంచెం మార్చి 'SSRMB' అంటూ మార్చారు. దీనికి మహేష్ బాబు అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో హర్ట్ అయ్యిపోయారు.
ఇక్కడ మహేష్ బాబుని రాజమౌళి గ్లోబల్ సినిమాకి తీసుకెళ్తున్నారు.కానీ మహేష్ బాబు మూలాన రాజమౌళి గ్లోబల్ సినిమాకి వెళ్లడం లేదు. సో ఇలాంటి ప్రాజెక్ట్ క్రెడిట్ ని ఒక్క హీరోకి మాత్రమే ఆపాదించడం, ఆ హీరోకి మాత్రమే రెస్ట్రిక్ట్ చెయ్యాలి అనుకోవడం ఖచ్చితంగా తెలివితక్కువతనమే అవుతుంది.ఇంకా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా తీయని మహేష్ బాబు అభిమానులకే అంత ఉంటే తెలుగు సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టిన రాజమౌళికి ఇసుమంతైనా గర్వం ఉండకూడదా?తన అభిమానులు కూడా జక్కన్నకి క్రెడిట్ ఇవ్వాలని కోరుకోరా? మరి రానున్న రోజుల్లో అయితే ఈ భారీ ప్రాజెక్ట్ "SSRMB" గా కొనసాగుతుందో "లేక SSMB29" గా కొనసాగుతుందో చూడాలి. కాగా ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉండగా మహేష్ బాబు తన కొత్త లుక్ లోకి మారే పనిలో ఉన్నాడు. అలాగే వచ్చే ఏడాది నుంచి అయితే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసుకోనుందట. వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేసుకుంటుంది అని అలాగే ఒక గ్లొబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుంది అని మేకర్స్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అలాగే ఇది రాజమౌళి ఎప్పుడో ఆపేసిన ప్రాజెక్ట్ 'గరుడ' అంటూ కూడా పలు రూమర్స్ ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని అయితే దుర్గ ఆర్ట్స్ వారు ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారని ఒక అంచనా.