సైబర్ మోసం.. టాలీవుడ్ హీరోనే బురిడీ కొట్టించిన కేటుగాళ్లు?
ఈ క్రమంలోనే తన దగ్గర ఉన్న టెక్నాలజీని ఆలోచించి మంచి కోసం ఉపయోగించకుండా.. ఎంతోమంది ఫైబర్ నేరాలు పాల్పడేందుకు వాడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ఇక ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. అయితే ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ఇలా జనాలని బుడ్డి కొట్టించేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటూనే ఉన్నారు. ఇప్పటివరకు ఎంతోమంది సామాన్య ప్రజలను ఇలా ఎంతో మంది సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఇక్కడ ఏకంగా సినిమా హీరోనే సైబర్ కేటుగాళ్లు బడి కొట్టించారు. ఏకంగా 45 లక్షల రూపాయలను కాజేశారు. టాలీవుడ్ నటుడు బిష్ణు అధికారి ఏకంగా 45 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. యూట్యూబ్లో ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తే.. డబ్బులు వస్తాయని కేటుగాళ్లు ఇతని నమ్మించారు. ఇందుకోసం తోలుత కొంతమొత్తంలో డబ్బు ఇవ్వాలి అని చెప్పడంతో పలు అకౌంట్లో అతను డబ్బులు జమ చేశాడు. చివరికి అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి.. ఇక పోలీసులను ఆశ్రయించాడు. కాగా ఇతను స్వీయ దర్శకత్వంలో హిట్ మాన్ అనే సినిమా తీశాడు. అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎంతలా అవగాహన కల్పిస్తున్న కొంతమంది మాత్రం చిన్నచిన్న పొరపాట్లు చేసి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు.