జనతా గ్యారేజ్ టైమ్ లోనే ఎన్టీఆర్ కి ఆ మాట ఇచ్చాను.. కొరటాల శివ..!

frame జనతా గ్యారేజ్ టైమ్ లోనే ఎన్టీఆర్ కి ఆ మాట ఇచ్చాను.. కొరటాల శివ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఈయన మిర్చి మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈయన కెరియర్ను ప్రారంభించిన తర్వాత మిర్చి సినిమా తర్వాత దర్శకత్వం వహించిన శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలు వరుసగా విజయాలను అందుకున్నాయి. ఆఖరుగా కొరటాల "ఆచార్య" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా భారీ అపజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దేవర అనే మూవీ ని రూపొందించాడు.

ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో చాలా కాలం క్రితం కొరటాల శివ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ దేవర సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. మిర్చి సినిమా కంటే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎన్టీఆర్ తో నేను రూపొందించిన జనతా గ్యారేజ్ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవు. నేను ఆ సినిమా చేస్తున్నప్పుడే ఎన్టీఆర్ తో చెప్పాను ఈ సినిమాలో కాస్త యాక్షన్ తక్కువైంది. కానీ నేను నెక్స్ట్ నీతో మరో సినిమా చేయబోతున్నాను. దాంట్లో మాత్రం యాక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది అని చెప్పాను.

చెప్పినట్లుగానే ఎన్టీఆర్ తో నేను చేయబోయే సినిమాలో అదిరిపోయే రేంజ్ యాక్షన్స్ అనే వేషాలు ఉంటాయి అని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీ బృందం వారు విడుదల చేయగా అందులో రక్తపాత సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయం అందుకొని , ఏ రేంజ్ కలెక్షన్లను బస్సులు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: