రామ్
చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నా శంకర్ ఇండియన్ సినిమాతో నిరాశ పరిచిన నేపథ్యంలో గేమ్ ఛేంజర్ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. అయితే గేమ్ ఛేంజర్ లో ఇంటర్వెల్ సీన్ కోసం దాదాపు రూ.3 కోట్ల వరకు ఖర్చుపెట్టి ఆ ఒక్క సీన్నే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక సినిమా మొత్తానికి ఆ సీన్ చాలా హైలెట్ గా నిలువబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారు.మెగా అభిమానులు సైతం ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ని అందుకుంటే తనను మించిన నటులు మరెవరు ఉండరు అనే రీతిలో వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ సినిమా పాన్ ఇండియా మూవీగా ఇతర భాషల్లో సైతం విడుదల కానుండటం గమనార్హం. గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఛేంజర్ సినిమా కియారా అద్వాని కెరీర్ కు కీలకం కాగా పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ ఆకలిని ఎంతమేర తీరుస్తుందో చూడాలి. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి త్వరలో సెకండ్ సింగిల్ రిలీజ్ కానుండగా రిలీజయ్యే డేట్ కు సంబంధించి అతి త్వరలో క్లారిటీ రానుంది.గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మ్యూజిక్, బీజీఎం హైలెట్ గా నిలవనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. గేమ్ ఛేంజర్ 2024 మెమరబుల్ సినిమాలలో ఒక సినిమాగా నిలవనుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ చరణ్ కెరీర్ లో గేమ్ ఛేంజర్ అవుతుందో లేదో చూడాలి.భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ మరో రేంజ్‌లో ఉంటుందని అంటున్నారు. దర్శకుడు శంకర్ ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్‌ను అద్భుతంగా ప్లాన్ చేశారట. ఈ సీక్వెన్స్ ఫ్లాష్ బ్యాక్‌లో రానుందని.. స్వతంత్ర పోరాట యోధుల గొప్పతనాన్ని చెప్పే విధంగా ఉంటుందని, రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సీక్వెన్స్ ఉంటుందని అంటున్నారు.