అతిధి తర్వాత రాజమౌళి కోసం అలాంటి ప్రయోగం చేస్తున్న మహేష్..?

frame అతిధి తర్వాత రాజమౌళి కోసం అలాంటి ప్రయోగం చేస్తున్న మహేష్..?

Pulgam Srinivas
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించి తెలుగు సినీ పరిశ్రమ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు . ఇక పోతే మహేష్ ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే మహేష్ తన తదుపరి మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక ఓ వైపు రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంటే , మరో వైపు మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం న్యూ లుక్ లోకి వచ్చేస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే భారీగా జుట్టును పెంచి , గుబురు గడ్డాన్ని కూడా పెంచేశాడు. ఇలా సరికొత్త లుక్ లోకి మహేష్ వచ్చేసాడు. ఇకపోతే కొన్ని సంవత్సరాలు క్రితం మహేష్ "అతిధి" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ పొడువాటి జుట్టుతో న్యూ లుక్ లో కనిపించాడు. ఆ తర్వాత మహేష్ ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పొడవాటి జుట్టుతో ఏ సినిమాలో నటించలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మహేష్ మళ్ళీ రాజమౌళి సినిమా కోసం పొడవాటి జుట్టును పెంచాడు. ఇది ఇలా ఉంటే రాజమౌళి , మహేష్ కాంబోలో రూపొందబోయే సినిమా స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: