టాలీవుడ్
యువ నటుడు నితిన్ ఈ మధ్య కాలంలో నటించిన ఏ
సినిమా కూడా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. ఆఖరుగా నితిన్ ,
వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ
సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. ప్రస్తుతం నితిన్ ,
వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ ,
వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు అనే సినిమాలలో
హీరో గా నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం రెండు సినిమాలలో హీరోగా నటిస్తున్న నితిన్ చేతిలో మరిన్ని సినిమాలు కూడా ఉన్నాయి.
అందులో భాగంగా నితిన్ కొంత కాలం క్రితం
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో నితిన్ హీరోగా
విక్రమ్ దర్శకత్వంలో ఇష్క్
మూవీ తెరకెక్కి బ్లాక్ బాస్టర్ కావడంతో వీరి కాంబోలో
సినిమా రాబోతుంది అని న్యూస్ బయటకు రావడంతోనే ఆ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాను హనుమాన్
మూవీ నిర్మాత అయినటువంటి నిరంజన్
రెడ్డి రూపొందించబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ఈయన ఈ
సినిమా నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... నితిన్ ,
విక్రమ్ కాంబో
మూవీ కి దాదాపు 80 కోట్ల వరకు బడ్జెట్ కానుండగా నిరంజన్
రెడ్డి "హనుమాన్"
మూవీ తో మంచి లాభాలను అందుకున్న , తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించి చాలా మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నాడు. దానితో ఈయన ఆర్థికంగా ప్రస్తుతం కష్టాల్లో ఉండడంతో ఈ సినిమాను వదిలేసినట్లు తెలుస్తోంది. దానితో ఈ సినిమాను
నిర్మాత శ్రీనివాస
చిట్టూరి నిర్మించబోతున్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.