ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్.. ఆ తర్వాత మహేష్ కు ఫ్లాప్ లు అందించిన దర్శకులు వీరే..?

frame ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్.. ఆ తర్వాత మహేష్ కు ఫ్లాప్ లు అందించిన దర్శకులు వీరే..?

MADDIBOINA AJAY KUMAR
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. ఇకపోతే మహేష్ బాబు తో ఇప్పటి వరకు అనేక మంది దర్శకులు పని చేయగా అందులో మొదటి మూవీ తో మహేష్ బాబు కు బ్లాక్ బాస్టర్ విజయాన్ని ఇచ్చి ఆ తర్వాత ఫ్లాప్ ఇచ్చిన వారు కూడా కొంత మంది ఉన్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.

మహేష్ బాబు కెరియర్ ప్రారంభంలో ఒక్కడు మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తర్వాత మహేష్ బాబు , గుణశేఖర్ దర్శకత్వంలో అర్జున్ , సైనికుడు అనే రెండు సినిమాలలో హీరోగా నటించాడు. కానీ ఈ రెండు మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది.

కొంత కాలం క్రితం మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే మూవీ రూపొందింది. ఈ సినిమాలో మహేష్ తో పాటు వెంకటేష్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం అనే మూవీ రూపొందింది. ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: