పుష్ప కి డెడ్ లైన్.. అప్పటివరకు అయితే ఓకే.. లేదంటే మళ్లీ అదే రిపీట్..?

frame పుష్ప కి డెడ్ లైన్.. అప్పటివరకు అయితే ఓకే.. లేదంటే మళ్లీ అదే రిపీట్..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మలయాళ నటుడు ఫాహద్ ఫజిల్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనసూయ , సునీల్ ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించారు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతుంది.

కొంత కాలం క్రితం ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక అందుకు అనుగుణంగా ఈ మూవీ బృందం ప్రచారాలను కూడా మొదలు పెట్టడంతో ఈ సైనా ఆగస్టు 15 వ తేదీన కచ్చితంగా విడుదల అవుతుంది అని జనాలు భావించారు. కానీ ఈ సినిమాను ఆగస్టు 15 వ తేదీన కాకుండా డిసెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ప్రస్తుతం కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి అక్టోబర్ చివరి వరకు డెడ్ లైన్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

అక్టోబర్ చివరి వరకు కచ్చితంగా ఈ సినిమా మొత్తం షూటింగ్ను పూర్తి చేయాలి అని అల్లు అర్జున్ ఈ మూవీ యూనిట్ కి సూచించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి వరకు ఈ సినిమా షూటింగ్ కనుక పెండింగ్ ఉన్నట్లు అయితే ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన కూడా విడుదల కావడం కష్టమే అని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ సినిమా డిసెంబర్ 6 వ తేదీన విడుదల అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: