టాలీవుడ్ యువ నటుడు రాజ్ తరుణ్ ఈ మధ్య కాలంలో వరస సినిమాలతో ప్రేక్షకులకు ముందుకు వస్తున్న ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదు. కొంత కాలం క్రితమే ఈయన పురుషోత్తముడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన అపజయాన్ని ఎదుర్కొంది. ఆ తర్వాత పెద్దగా గ్యాప్ లేకుండానే ఈయన తిరగబడరా సామి అనే మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఇక మళ్లీ ఈయన బలే ఉన్నాడే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు శివ సాయి వర్ధన్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఒక రోజు బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. ఇక ఈ మూవీ కి మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయి. మరి ఈ మూవీ కి మొదటి రోజు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ సినిమాకు మొదటి రోజు నైజాం ఏరియాలో 18 లక్షల కలెక్షన్లు రాగా , సీడెడ్ ఏరియాలో 5 లక్షలు , ఉత్తరాంధ్రలో 8 లక్షలు , ఈస్ట్ ప్లేస్ వెస్ట్ లో 4 లక్షలు , కృష్ణ ప్లస్ గుంటూరులో 6 లక్షలు , నెల్లూరు లో 3 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజు 44 లక్షల కలెక్షన్లు రాగా , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 6 లక్షల కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కి మొదటి రోజు 50 లక్షల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 1.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ 1.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా ఈ మూవీ మరో 1.30 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబడితే బ్రేక్ ఈవెన్ ఫార్మలాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.