నితిన్.. చైతూ లను స్పెషల్ టార్గెట్ చేసిన బడా హీరోలు.. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి..?

frame నితిన్.. చైతూ లను స్పెషల్ టార్గెట్ చేసిన బడా హీరోలు.. ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటి..?

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ యువ నటుడు అయినటువంటి నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ మూవీలోనూ , వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమాలోనూ హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలలో వెంకీ కుడుమల దర్శకత్వంలో రూపొందుతున్న రాబిన్ హుడ్ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆల్మోస్ట్ ఈ నెలలోనే ఈ సినిమా విడుదల అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇకపోతే నాగ చైతన్య ప్రస్తుతం థండెల్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చందు మండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను కూడా ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అయింది. ఇలా డిసెంబర్ నెలలో రాబిన్ హుడ్ , తాండెల్ మూవీలు విడుదల కానున్నట్లు ఈ రెండు మూవీల మధ్య గట్టి ఫైట్ ఉండే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ డిసెంబర్ నెలలోకి అనేక పాన్ ఇండియా మూవీలు దూసుకు రావడంతో ఈ రెండు సినిమాల జాడ లేకుండా పోయింది. ఈ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 సినిమా విడుదల కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ చేంజర్ మూవీ ని కూడా డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాను కూడా ఇదే నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూడు పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. ఇలా భారీ క్రేజ్ ఉన్న మూడు సినిమాలు ఈ నెలలోకి రావడంతో రాబిన్ హుడ్ , తాందెలు మూవీల విడుదల తేదీ పై కొత్త వార్తలు ఏమీ రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: