ఆ సన్నివేశాల కోసం ఏకంగా అన్ని రోజులు కష్టపడ్డా.. ఆ సీన్స్ మూవీని ఎక్కడికో తీసుకెళ్తాయి.. తారక్..!

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా రూపొందిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. కొరటాల శివ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను జోరుగా ముందుకు సాగిస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ , హీరోయిన్ జాన్వీ కపూర్ , విలన్ సైఫ్ అలీ ఖాన్ , దర్శకుడు కొరటాల శివ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూ కు టాప్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యాంకర్ గా వ్యవహరించాడు. సందీప్ రెడ్డి వంగ వీరిని అనేక ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడగగా ... వారు కూడా అంతే ఇంట్రెస్టింగ్ సమాధానాలను ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర" మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులందరికీ ఎంతగానో నచ్చుతుంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది అని చెప్పాడు.

అలాగే ఈ సినిమాలో ఒక అండర్ వాటర్ సీక్వెన్సెస్ ఉంటుంది. దానిని 25 రోజుల పాటు చిత్రీకరించాం. అది అద్భుతంగా వచ్చింది. సినిమా విడుదల అయిన తర్వాత ఆ సన్నివేశాలు ప్రేక్షకులను అద్భుతమైన స్థాయిలో ఆకట్టుకుంటాయి అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో ,  ఏ  రేంజ్ కలెక్షన్లను వస్తువులు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: