ఆరెంజ్ కి ముందు అలాంటి వర్షన్ అనుకున్నాను.. అందరూ భయపడ్డారు.. బొమ్మరిల్లు భాస్కర్..!

frame ఆరెంజ్ కి ముందు అలాంటి వర్షన్ అనుకున్నాను.. అందరూ భయపడ్డారు.. బొమ్మరిల్లు భాస్కర్..!

MADDIBOINA AJAY KUMAR
కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆరంజ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తాజాగా ఈ సినిమా దర్శకుడు అయినటువంటి బొమ్మరిల్లు భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా ఆరెంజ్ మూవీకి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. భాస్కర్ తాజాగా ఆరెంజ్ మూవీ గురించి మాట్లాడుతూ ... ఆరెంజ్ మూవీ కి మొదట ఒక వర్షన్ రాశాను. అది నాకు బాగా నచ్చింది. కాకపోతే అందులో చాలా బోల్డ్ కంటెంట్ ఉంటుంది. చెప్పే విషయాన్ని చాలా బోర్డ్ గా చెప్పే విధంగా ఆ వర్షన్ ను రాశాను. అది నాకు బాగా నచ్చింది. కానీ మిగతా వారికి పెద్దగా నచ్చలేదు. అలాగే చెప్పేదే కొత్త పాయింట్ ... మళ్లీ దానిని కొత్త యాంగిల్ లో చెప్తే ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో తెలియలేదు.

అందుకే కొత్త పాయింట్ ను కాస్త తెలిసే విధంగా చెబుదాము అని ఆ బోల్డ్ వర్షన్ పక్కన పెట్టి వేరే వర్షన్ తో ముందుకెళ్లాం అని భాస్కర్ తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. ఈ మూవీని అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొణిదెల నాగేంద్రబాబు నిర్మించగా ... హేరిస్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ సంగీతానికి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా సాంగ్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: