'దేవర'లో బిగ్ సర్ ప్రైజ్.. ఆ విషయం చెప్పి అంచనాలు పెంచిన తారక్?

frame 'దేవర'లో బిగ్ సర్ ప్రైజ్.. ఆ విషయం చెప్పి అంచనాలు పెంచిన తారక్?

praveen
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ నందమూరి హీరో నుంచి సినిమా వస్తుందంటే చాలు కేవలం ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా సినీ అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. కాగా త్రిబుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హిట్ తర్వాత ప్రస్తుతం తారక్ చేస్తున్న సినిమా దేవర. దేవర కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని చెప్పాలి. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ మూవీపై ఇక అదే రేంజ్ లో అంచనాలు కూడా ఉన్నాయి.

 ఇక ఎన్నో రోజులగా ప్రేక్షకులందరిలో అంచనాలను రెట్టింపు చేస్తూ వచ్చిన దేవర మూవీ.. ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమైంది  ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఇక దేవర మూవీ ప్రమోషన్స్ కు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తూ ఉంది. ఇక ఇదే ఈ బాలీవుడ్ భామకు మొదటి సినిమా కావడం గమనార్హం.

 ఇక ఇప్పటికే దేవర మూవీకి సంబంధించి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులు అందరిలో కూడా అంచనాలను మరింత పెంచేసింది అని చెప్పాలి. అయితే ఇటీవలే ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో ఒక బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది అని క్రేజీ న్యూస్ చెప్పాడు. దేవర సినిమాలో సముద్రంలో జరిగే సన్నివేశాల కోసం ఒక సపరేట్ పూల్ రూపొందించినట్లు తెలిపాడు. వాటర్ లో దాదాపు 35 రోజుల పాటు షూట్ జరిగింది. దీనివల్ల అవసరమైన దానికంటే కొంత ఎక్కువ ఖర్చయింది. ఈ సీక్వెన్స్ సినిమాకు చాలా ముఖ్యం అంటూ తెలిపారు. అయితే ఈ సినిమాలో ప్రేక్షకులు ఊహించని ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని.. ఈ సర్ప్రైజ్ చూసి ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు తారక్. దీంతో ఆ సర్ ప్రైజ్ ఏంటబ్బా అని ఆలోచనలో పడిపోయారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: