సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన కథతో మరొకరు
సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో
జూనియర్ ఎన్టీఆర్ ,
జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో
రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఏవి అనే వివరాలు తెలుసుకుందాం. యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా
కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కథను
కొరటాల మొదట
రామ్ చరణ్ కు చెప్పినట్లు కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఈ
సినిమా కథను రిజెక్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఆ తర్వాత ఇదే కథను
అల్లు అర్జున్ కి
కొరటాల వివరించగా , ఆయన కూడా ఈ స్టోరీ ని రిజెక్ట్ చేసినట్లు దానితో
కొరటాల ఈ
సినిమా కథను
జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ
సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ
సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొంత కాలం లోనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ
మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి సంబంధించిన
పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.
ఇకపోతే బుచ్చిబాబు ఈ కథతో యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా
సినిమా చేయాలి అనుకున్నాడట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో
రామ్ చరణ్ కు ఈ స్టోరీ చెప్పడం ,
రామ్ చరణ్ కు ఆ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా
రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో
జూనియర్ ఎన్టీఆర్ ,
జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో చరణ్
సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.